

Mana News :- అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న మిట్టూరుకు చెందిన మనీ అలియాస్ మణిగండన్ అనే నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచిరూ.3 లక్షలు విలువచేసే 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ జయరామయ్య తెలిపారు. ఇచ్చాపురం నుండి గంజాయి కొనుగోలు చేసి చిత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకున్న అతన్ని నిగా పెట్టి అరెస్ట్ చేశామన్నారు. ఇతను పై గతంలో 7 క్రిమినల్ కేసులు నమోదయినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ జయరామయ్య తెలుపుతూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు డి.ఎస్.పి సాయినాథ్ ఆధ్వర్యంలో గంజాయి వ్యక్రేతలపైన అన్నిగా పెంచామన్నారు. ఎవరైనా అక్రమంగా గంజాయి విక్రయించిన సరఫరా చేసిన, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారి పైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
