మోదీ సర్కార్‌పై కమల్ హాసన్ సంచలన ఆరోపణలు

Mana News :- గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమికి.. తమిళనాడులో అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గుతాయనే ఆందోళనలను డీఎంకే లేవనెత్తుతోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దుతోందని ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా తాజాగా సమావేశమై చర్చించాయి. ఈ క్రమంలోనే ఈ సమావేశానికి హాజరైన మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇండియాను హిందీయాగా మార్చే ప్రయత్నం జరుగుతోందని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కమల్ హాసన్ విమర్శలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి.. ఎన్నికల్లో విజయం సాధించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే.. వారు మాత్రం హిందీయా అని కలలు కంటున్నారని కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే డీలిమిటేషన్, త్రిభాష అంశాలపై తమిళ పార్టీలు బుధవారం సమావేశమై చర్చించి.. ఒక తీర్మానాన్ని ఆమోదించి.. కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలోనే కమల్‌ హాసన్‌ హిందీయా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. 2019లో వాడిన హిందీయా పదాన్ని కమల్ హాసన్ ప్రస్తావించారు. అంతర్జాతీయంగా భారత్‌ అంటే గుర్తొచ్చే భాష హిందీనే అని 2019 హిందీ దివస్ రోజు కేంద్రమంత్రి అమిత్‌ షా ఒక పోస్ట్ పెట్టగా.. దానికి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఇది ఇండియా అని.. హిందీయా కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇటీవల మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలతో సమావేశమై మాట్లాడిన కమల్ హాసన్.. తమిళ ప్రజలు భాష కోసం ప్రాణాలకు తెగించి పోరాడారని.. ఆటలొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!