

Mana News , హైదరాబాద్: హైదరాబాద్ అంబర్పేట్లోని ఫ్లైఓవర్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకున్నది. దీంతో స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నల్లటి పొగ కమ్ముకోవడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అంబర్పేట నూతన ఫ్లైఓవర్పై నుంచి రాకపోకలు ఫిబ్రవరి 26న ప్రారంభమైన విషయం తెలిసిందే.