

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, జీవితం పై విరక్తి చెంది ఓ యువకుడు నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజాంసాగర్ లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలంలోని బంజపల్లీ గ్రామానికి చెందిన అంద్యాల హరి కుమార్ (29) గత కొంత కాలంగా మద్యానికి బాని సై ఆర్థికంగా ఇబ్బందులకు గురై జీవితం పై విరక్తితో శనివారం రోజున ఇంటి నుండి బయలు దేరి నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం కొరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాగా మంగళవారం ఉదయం మృతదేహం ప్రాజెక్టులో తేలడంతో మృతుడి తల్లి రాజమణి ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
.