

Mana News :- విరాట్ కోహ్లీ కనీసం మరో నాలుగేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంకా చాలా ఏళ్లు ఐపీఎల్ ఆడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. విరాట్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, నిలకడే అతడి ఆయుధం అని చెప్పారు. ఆటపై అతడి ప్రేమ కొనసాగినంత కాలం ఆడుతూనే ఉంటారన్నారు. కాగా ప్రస్తుతం విరాట్ వయసు 36 ఏళ్లు.