

గొల్లప్రోలు మార్చి 1 మన న్యూస్ :– శనివారం జనసేన పార్టీ కార్యాలయంలొ జరిగి ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో యన్ డి ఎ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2025-26 బడ్జెట్ ను రూ:3,22,359 కొట్లా రూపాయిలతో ఎంతో అద్భుతంగా ప్రవేశ పెట్టడం జరిగిందని,ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గల పేద,బడుగు,బలహీన వర్గాల సంక్షేమం దిశగా బడ్జెట్ను రూపొందిస్తూ,స్వర్ణాంధ్ర నిర్మాణం కొరకు అనేక నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్లో గల పేదవారికి నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ,వ్యవసాయ ఆధారిత రంగాలకు,సామాజిక పెన్షన్లు కొరకు,ఉత్పాదకత రంగాలకు ప్రాదాన్యతనిచ్చి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూడా నిధులను కేటాయించిన వైనం స్వర్ణ అంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి పూనాదులను వేసినట్టు అయినదని అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు సామాజికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అన్ని శాఖలకు,శాఖల వారీగా నిధులను కేటాయించడం జరిగిందని.సూపర్ 6 లో తల్లికి వందనం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రైతు భరోసా ,మహత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కి నిధులను,యన్ టి ఆర్ జలసిరి కి నిధులను కేటాయించడం జరిగినది.బడ్జెట్‌లో సగం డబ్బులు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డి చెల్లించడానికి సరిపోతుందని వైసీపీని ఘాటుగా విమర్శించారు.
ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్టాడుతూ ప్రజలకు ఆశాజనకంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి & పిఠాపురం శాసనసభ్యులు కొణిదల పవన్ కళ్యాణ్,ఆర్దిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితర మంత్రులకు, తెలుగుదేశం,జనసేన,బిజెపి శాసనసభ్యులకు జ్యోతుల ధన్యవాదాలు జ్యోతుల శ్రీనివాసు తెలిపారు.