

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:తాను మరణించినా తన కళ్లు మరొకరికి చూపు ఇవ్వాలనే గొప్ప ఆశయం ఆయన చేసిన నేత్రదానం అందరికీ ఆదర్శంగా నిలిచింది.ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన కేలంగి రామకృష్ణ సోమవారం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు రామకృష్ణ చివరి కోరిక తీర్చేందుకు రాజమహేంద్రవరం కు చెందిన రాధాకృష్ణ కంటి ఆసుపత్రికి సమాచారం అందించారు.కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన స్వామి వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాధాకృష్ణ కంటి ఆసుపత్రి నుంచి టెక్నీషియన్ కొత్త ఎర్రవరం చేరుకుని రామకృష్ణ నేత్రాలను సేకరించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులు ఏసు, చిన్నమ్మ,విష్ణు,బాబ్జి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.స్వామి వివేకానంద సేవా సంస్థ నిర్వాహకులు మేరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.బతికున్నంతకాలం మంచి,చెడు,సుఖం,దుఃఖం ఇలా చాలానే చూసుంటాం. కానీ, నేత్రదానం చేస్తే మరణానంతరం కూడా మన కళ్లు మరో ప్రపంచాన్ని చూస్తాయి. మానవత్వంలోని మాధుర్యాన్ని, అత్యంత సుందర భావాలను దర్శిస్తాయి.మట్టిలో కలిసిపోయే ముందు మరొకరి జీవితంలో వెలుగు నింపితే.వారి ఆనందాన్ని మన నయనాలు నింపుకుంటాయి.స్వచ్చంద నేత్రదానానికి అందరూ ముందుకు రావాలన్నారు. తమ సంస్థ ద్వారా నేత్రాలను సేకరించినట్లు జరిగిందని పేర్కొన్నారు.