మనన్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వంద రోజుల్లో 100 రహదారుల నిర్మాణాన్ని విజయవంతంగా చేశామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.సోమవారం మక్కువ మండలం కాశీ పట్టణంలో రోడ్డు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో మారుమూల గ్రామాలు అభివృద్ధి లక్ష్యంగా,మక్కువ మండలంలో 45 రోడ్లు సాలూరు మండలంలో 20 రోడ్లు పాచిపెంట మండలంలో 20 రోడ్లు మెంటాడ మండలంలో 20 రోడ్లు పూర్తి చేశామన్నారు. మక్కువ పంచాయితీలో 15 రోడ్లు పనులు పూర్తయ్యావన్నారు మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆరు నెలల్లో రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించమన్నారు వెంగల రాయ సాగర్ ప్రాజెక్టుకు రూ.40 లక్షల నిధులు ఎమ్మెల్సీగా సంధ్యారాణి తీసుకొస్తే తామే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు.మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తండ్రి మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలు వెంగళ రాయ సాగర్ ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. సాలూరు పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు డాక్టర్ మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కాశీపట్నం సర్పంచ్ చందర్రావు, ఎం పి టి సి. శoబర ఎం.పి. టి.సి.తీళ్ళ తిరుపతిరావు,తహసీల్దార్, ఇబ్రహీం,పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *