మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని ఎస్‌సి కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సింగరాయకొండ ఎస్సై మహేంద్ర నేతృత్వంలో పోలీసులు దాడి చేసి, నిందితుల వద్ద నుండి రూ.3,450 నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఎస్సై మహేంద్ర మాట్లాడుతూ, గ్రామాల్లో అక్రమ పేకాట, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి చర్యలు కొనసాగుతాయని తెలిపారు..









