మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సహాయకుడు బొడ్డు నరసింహం ఆకస్మిక మరణం పట్ల తహసీల్దార్ రాజేష్ దుఃఖం వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నరసింహం అందించిన సేవలు మరువలేనివని తహసీల్దార్ రాజేష్ పేర్కొన్నారు. ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.రెవెన్యూ శాఖకు నరసింహం మృతి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది అంతా పాల్గొని నరసింహం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.









