మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ,
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిన్న ఉదయం సింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మానవత మండల శాఖ అధ్యక్షులు సిహెచ్ . సుధాకర్ రెడ్డి, సెక్రటరీ జె.వి. సుబ్బారావు, మ్.వి. రత్నం, మారెళ్ళ లక్ష్మీనారాయణ, కోటపాటి నారాయణ, జి. రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ గారి అహింసా సిద్ధాంతం, నైతిక విలువలు ఈ తరానికి మార్గదర్శకమని, ఆయన చూపిన సత్యం, అహింసా బాటలో నడవాలని పిలుపునిచ్చారు.









