మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం,
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమరాజుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వేల్పుల సింగయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను సన్మానించారు.ఈ గ్రామసభలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శీలం సుబ్రహ్మణ్యం, యువ నాయకుడు షేక్ కరీముల్లా (ఢిల్లు), గ్రామ ప్రధాన కార్యదర్శి బొడ్డు బాలకోటయ్య, మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు కుంచాల ప్రసాద్, మహిళా నాయకురాలు యనమల సుబ్బరత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.









