మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ,
జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవాభివందనాలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కాసుల శ్రీకాంత్, సొసైటీ సభ్యులు కూనపరెడ్డి రంగారావు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు అనుమల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రచార కార్యదర్శి తగరం రాజు, చుండూరి సుబ్బారావు, శ్రీరాములు, స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.నాయకులు గాంధీ గారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆయన చూపిన అహింసా మార్గం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.









