బంగారుపాళ్యం ఆగస్ట్ 11 మన ద్యాస (నాగరాజ సరకింటి)
70 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది బంగారుపాళ్యం ఎస్సీ కాలనీ ప్రజల చిరకాల స్వప్నం సాకారంఎన్నికల హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ బంగారుపాళ్యం మండలంలోని ఎస్సీ కాలనీ ప్రజలు గత 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న శ్మశానవాటిక సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ చొరవతో కాలనీ ప్రజల చిరకాల సమస్య పరిష్కారమైంది.ఎన్నికల ప్రచార సమయంలో బంగారుపాళ్యం ఎస్సీ కాలనీ ప్రజలు తమకు శ్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే, తాను అధికారంలోకి వచ్చిన అనంతరం శ్మశానవాటికకు స్థలం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరో కీలక అడుగు వేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి బంగారుపాళ్యం ఎస్సీ కాలనీలో స్వయంగా పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి, శ్మశానవాటిక ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మంజూరు చేయించారు. దీంతో సుమారు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించింది.ఎన్నో సంవత్సరాలుగా తమ సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కాలనీ ప్రజలు స్థలం మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తుంచుకుని, స్వయంగా కాలనీలో పర్యటించి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.70 ఏళ్ల నిరీక్షణకు తెరదించి శ్మశానవాటికకు స్థలం మంజూరు చేయించడం ద్వారా ఎమ్మెల్యే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని స్థానికులు అభినందించారు.