తవణంపల్లి అక్టోబర్ 2 మన ద్యాస
తవణంపల్లి మండలం విద్యాశాఖ అధికారి హేమలత పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్టోబర్ 5 న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తవణంపల్లి మాజీ జడ్పిటిసి వెంకటేశ్వర చౌదరిని ఆహ్వానం పలికారు. అనంతరం ఎం ఈ ఓ తో పాటు పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







