యాదమరి ఆగస్ట్ 12 మన ద్యాస

యాదమరి మండలంలోని దళవాయిపల్లి గ్రామంలో యాదమరి మండల పార్టీ అధ్యక్షులు మురార్జీ యాదవ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు షణ్ముఖ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మురార్జీ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్, జిల్లా పార్టీ అధ్యక్షులు షణ్ముఖ రెడ్డి కలిసి మురార్జీ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.మురార్జీ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత చురుకుగా పనిచేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.ఈ జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మురార్జీ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో దళవాయిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *