బిజెపి శ్రేణులు గాజువాకలో కొనసావా కార్యక్రమాలు నిర్వహణ

గాజువాక బిజెపి సమన్వయకర్త కరణం రెడ్డి నర్సింగరావు..

విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు11:బిజేపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా గాజువాక కన్వీనర్ మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు(కెఎన్ఆర్) ఆధ్వర్యంలో పలువురు నాయకులతో కలిసి మాధవ్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సారధ్య,అటల్ మోదీ సుపరిపాలన యాత్ర,జనతా వారధి, మన ఊరు మన జెండా వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.పార్టీ జెండా ప్రతి వీదిలో ఎగిరే విధంగా కార్యకర్తలను తయారు చేసారని అన్నారు. ప్రదానినరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.కెఎన్ఆర్ సౌజన్యంతో మాధవ్ పుట్టిన రోజు సందర్భంగా అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్ లో 100 మంది రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసారు.శ్రీనగర్ డిజైర్ సొసైటీ హెచ్.ఐ.వి పాజిటివ్ పిల్లలకుపౌష్టికాహారం కిట్లు పంపిణీ మరియు పాతకర్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో వంద మంది పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసామని కేఎన్ఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకరరావు,బొత్స దిలీప్, రంగనాయకులు,ఈశ్వరరావు,కృష్ణారెడ్డి,ముసలయ్య,జాగారపుశ్రీను,తాతారావు,రవీంద్ర,రాజు,కేవి రమణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *