మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
గ్రామీణ క్రీడాకారులు నిరంతర అభ్యాసంతో వాలీబాల్ నైపుణ్యం పెంపొందించుకోవాలని జూనియర్ వాలీబాల్ జాతీయ కోచ్ రమణారావు పిలుపునిచ్చారు. పాకలలో జూనియర్ వాలీబాల్ క్రీడాకారుల పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి పాకల గ్రామ పంచాయతీ సర్పంచ్ సైకం చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, “పాకల ఉన్నత పాఠశాల క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఆ గౌరవాన్ని నిలబెట్టడం క్రీడాకారుల భాద్యత” అని తెలిపారు.కోచ్ రమణారావు మాట్లాడుతూ, జూనియర్ స్థాయి నుండే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి జిల్లా, రాష్ట్ర స్థాయి ఎంపికల్లో అవకాశాలు కల్పించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేశామని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్లస్ టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వడ్లమూడి కోటేశ్వరరావు, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా నాయకులు ధనుంజయరావు, నారసింహరావు, బత్తుల రాజగోపాలరెడ్డి, పాకల గ్రామ వాలీబాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు..









