న్యూస్.భీమ్‌గల్
భీమ్‌గల్: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని భీమ్‌గల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు
ఎంతగానో ప్రసిద్ధిగాంచిన
బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని
భద్రకాళి అమ్మవారి ని
దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ శ్రావణమాసంలో దైవదర్శనం చేయడం ఎంతో శుభప్రదమని, ఆధ్యాత్మికతతో పాటు సంఘ సభ్యుల మధ్య సోదరభావం, ఐక్యత మరింత బలపడేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఆర్యవైశ్య సంఘ సభ్యుల కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐక్యత, అభివృద్ధి కలగాలని శ్రీ వీరభద్రస్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
అనంతరం ఆలయ పరిసరాల్లో కొంత సమయం ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. ఈ దర్శన కార్యక్రమం సంఘ సభ్యుల్లో భక్తిభావాన్ని, ఆనందాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *