మర్రిపాడు,ఆగస్టు 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9 న వరంగల్ లో జరుగు ఎమ్మార్పీఎస్. ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల కమిటీల జాతీయ సదస్సుని జయప్రదం చేయుటకై సోమవారం మర్రిపాడు మండలం టౌన్ లో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ మండల సదస్సు కార్యక్రమం ఎంఎస్పీ మండల ఇన్చార్జీ నల్లిపోగు అంకయ్య మాదిగ ఆధ్వర్యంలోజరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జీ మంద వెంకటేశ్వరరావు మాదిగ,ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జీ పందిటి అబేద్కర్ మాదిగ,పోల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీవర్గీకరణ కలను నెరవేర్చిన గొప్ప మహానీయుడు మందకృష్ణ మాదిగని ఆయనను కొనియాడారు అధేవిధంగా భవిష్యత్ లో రాజ్యధికారమే తీసుకోబోయే లక్ష్యం వైపు పయనించాలని అందుకు ఇప్పటి నుండే మాదిగలు సిద్ధం కావాలని అందులో భాగంగా సెప్టెంబర్ 9 జరగబోయే జాతీయ సదస్సుని విజయవంతం చేయాలి అందుకు నేడు మర్రిపాడు మండలంలో నూతన మండల కమీటీలను ఏర్పాటు చేయటం జరిగిందని వారు అన్నారు.ఎమ్మార్పీఎస్,మండల అధ్యక్షులుగా గుర్రాల పెంచల వర ప్రసాద్ మాదిగ ,అధికారప్రతినిథులుగా సోంపల్లి కిరణ్ మాదిగ,ప్రధాన కార్యదర్శి కత్తి సింహాద్రి మాదిగ,ఎంఎస్పీ మండల అధ్యక్షులుగా కొప్పోలు వెంకటయ్య మాదిగ, అధికారప్రతినిథిగా నాగిపోగు నాగేశ్వరావు మాదిగ,ప్రధాన కార్యదర్శిగా,చింతపల్లి శ్రీనివాస్ మాదిగ,ఉపాధ్యక్షులుగా గడి శ్రీనివాసులు మాదిగ,నల్లిపోగు మస్తాన్ మాదిగ,కార్యదర్శి కుంటా వెంకటేష్ మాదిగలను,కమీటీల సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ నాయకురాలు మోటుపల్లి దాక్షాయిని,ఎమ్మార్పీఎస్ సీనియర్ సోంపల్లి హజరత్ మాదిగ,కన్నెమరకల వెంకటేశ్వర్లు మాదిగ,కన్నెమరకల తిరుపతి మాదిగ,మర్రిపాడు మండలంలోని అన్ని గ్రామాల నుండి అత్యధిక సంఖ్యలో మాదిగ పెద్దలు యువకులు విధ్యార్ధులు తదితరులు పోల్గొన్నారు.
