మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
కనుమళ్లలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఫార్మసిస్టులు ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సెమినార్లు చేపట్టారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్. సాయి బాబు, మలినేని కాలేజెస్ డైరెక్టర్ డాక్టర్ ఏ. గోపాల కృష్ణమూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. వెంకటేశ్వర్లు , అధ్యాపక బృందం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సింగరాయకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఎన్. వంశీ ధర్మ హాజరై విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.ఈ ర్యాలీ సింగరాయకొండ బస్టాండ్ నుండి ప్రారంభమై కందుకూరు రోడ్ వరకు సాగి ప్రజల్లో ఫార్మసీ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది.







