మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలోని పాఠశాల ఆవరణలో శుభ్రత కార్యక్రమం నిర్వహిస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య, సింగరాయకొండ ఎంపీడీఓ జయమణి, డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం చంటి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కుంచాల ప్రసాద్, షేక్ నాసీర్, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ చిమట సుధాకర్, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అధికారులు ప్రజలందరూ శుభ్రతలో భాగస్వాములై గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.









