మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
మహిళల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మొత్తం కుటుంబంపైనే పడుతుందని గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత పట్ల బాధ్యతతో ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ధీరేంద్ర పిలుపునిచ్చారు.నారీ శక్తి అభియాన్ కార్యక్రమం లో భాగంగా సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బింగినపల్లి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు సన్నెబోయిన మాలకొండయ్య పర్యవేక్షించారు.ఈ సందర్భంగా డా. ధీరేంద్ర మాట్లాడుతూ, మహిళా ఆరోగ్యం ఇంటి మహాభాగ్యం అని, గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వీటిలో వైద్య సిబ్బంది, అవసరమైన మందులు, పరీక్షలు అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయని వివరించారు. ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తదనంతరం, తెలుగుదేశం పార్టీ నాయకుడు సన్నెబోయిన మాలకొండయ్య మాట్లాడుతూ, తీరప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు







