

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గవదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ మరియు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని (17 సెప్టెంబర్) మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులకు నోటుపుస్తకాలు, మిఠాయిలు పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి రక్షణ వలయం ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.తరువాత విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక నాయకులు కలిసి పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు శ్రీరామగిరి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. మోడీ గారు భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టారని, నిస్వార్ధంగా దేశ సేవకు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
మండల బిజెపి అధ్యక్షులు తల్లపనేని రమేష్ మాట్లాడుతూ – “మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం మనందరి గర్వకారణం. స్వచ్చ భారత్ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు,మండల BJP నాయకులుతన్నీరు శ్రీను, రామకృష్ణ,కుంచాల ప్రసాద్,శ్రీరామ మూర్తి,జాలిరెడ్డి మహిళా నాయకురాలు లక్ష్మి,జనసేన నాయకులు ఖాజా హుస్సేన్, అధ్యాపకులు అజయ్ చౌదరి,అంగన్వాడీ కార్యకర్త రజని,విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
