

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సహాయ సంచాలకులు నిర్మల కుమారి మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. భూసార పరీక్ష ఆధారంగా ఎరువులను వినియోగించాలని, పంటలు సాగు చేసుకున్న తర్వాత ఈ-క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి అని సూచించారు.
వ్యవసాయ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగించడం వల్ల పంటల దిగుబడి పెరుగుతుందని వివరించారు. అనంతరం గ్రామంలోని కొబ్బరి పొలాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ షేక్ నజ్మా షెమిలా బేగం, గ్రామ వ్యవసాయ సహాయకులు సత్యసాయి, జడ్పీఎన్ ఎఫ్ వెంకటరమణ మరియు రైతులు పాల్గొన్నారు.