

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం, రాష్ట్రాలకే అమలు బాధ్యత అప్పగించబడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి మాదిగల 30 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిందని గుర్తుచేస్తూ ఈ నెల 22న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగబోయే మాదిగల కృతజ్ఞత సభ ను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రం విడుదల కార్యక్రమం సింగరాయకొండలో జరిగింది.ఈ కార్యక్రమాన్ని సింగరాయకొండ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “మాదిగల ఆశయ సాధనలో ఇది చారిత్రాత్మక ఘట్టం. అందరూ ఐక్యంగా పాల్గొని సభను జయప్రదం చేయాలి” అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ మండల కో-కన్వీనర్లు పోనుగోటి ఉదయ్ కుమార్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.