

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం గ్రామంలో దాచేపల్లి కృష్ణకిషోర్ కూడా ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళవారం మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనయులు యువనాయకులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, టంగుటూరు మండల అధ్యక్షులు కందుకూరి రాంబాబు సమక్షంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఇద్దరికీ 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులను మంగళవారం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జడ బాల నాగేంద్ర యాదవ్, చీకటి వంశీదీప్, కందుకూరి బాబు, బెల్లంకొండ సాయిబాబా, రాయపాటి అరుణ, దొంతుల కిషోర్, గూడా శశిభూషణ్, యన్నం రాము, పత్తిపాటి మాధవరావు మరియు జనసేన పార్టీ సింగరాయకొండ టంగుటూరు పొన్నలూరు మండలాల ముఖ్య నాయకులు, మండల కమిటీ సభ్యులు, క్రియశీల వాలంటీర్లు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని నింపి భరోసా కల్పించి నివాళులు అర్పించడం జరిగింది.