

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కొరకు కష్టపడిన వారికి ఎప్పుడూ మంచి స్థానం లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా, టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు