

ఈ నెల 12న చిన్న జీయర్ స్వామి రాకతో భారీ స్వాగత ఏర్పాట్లు
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి ఈనెల 12న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,వేద గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి వస్తుండడంతో ఘన స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి హాజరై చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పా రెడ్డి,తేజో మూర్తుల సుబ్రహ్మణ్య శర్మ,పత్రి రమణ,గోగుల వెంకటేశ్వరరావు,రెడ్నం రామచంద్రరావు,నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.