Mana News:- చిత్తూరు జిల్లా,ఐరాల మండలం,45 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.బాలాజీ కుమారుడు కె.హరీష్ బాబు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువసంఘం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్నారు.హరిష్ ప్రస్తుతం చిత్తూరు విజయం బిజినెస్ స్కూల్లో ఎంబిఎ మొదటి సంవత్సరం చదువుతున్నారు, చిన్నప్పటి నుంచి సమాజసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గత నెల హరిష్ చేస్తున్న సేవ కార్యక్రమాలు గుర్తించి ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ వారు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు 2024 ను బహూకరించారు.అలాగే జిల్లా స్థాయిలో వివిధ పోటీ కార్యక్రమాల్లో గెలుపొందారు హరీష్. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువసంఘం యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్ని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT అలహాబాద్ డైరెక్టర్ శ్రీ.ప్రొఫెసర్ ముకుల్ సుతానే నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నవంబర్ 26 నుండి డిసెంబర్ 1 వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న డెలిగేట్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని చారిత్రక ప్రదేశాలు,అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలు సందర్శించారు.ఈ సందర్భంగా హరిష్ ను కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు,పలువురు అభినందించారు.







