మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో మంగళవారం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఉదయం బిట్రగుంట కాళ భైరవ స్వామి ఆలయం లో పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. మండల కేంద్రమైన సింగరాయకొండ లోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట బాణా సంచాపేల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యాలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. శానంపూడి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ, అనంతరం కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. అధ్వాన్నంగా మారి ప్రజలు ప్రయాణించ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి, నిత్యం రద్దీగా ఉండే సింగరాయకొండ నుండి శానంపూడి గ్రామం వెళ్ళే రహదారి, పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా దాతల సహకారంతో క్వారీ డస్ట్ తో రహదారి నీ మరమ్మతులు నిర్వహించడం జరిగినది. ఈ క్రమంలో భాగంగా సోమరాజుపల్లి పంచాయతీ సాయినగర్ లో టీడీపీ సీనియర్ నాయకులు వేల్పుల సింగయ్య, జనసేన కార్యదర్శి అనుముల శెట్టి కిరణ్ బాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పేరు పై పూజలు నిర్వహించి కేక్ కటింగ్ చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో కొండేపి POC కనుపర్తి మనోజ్ సీనియర్ జర్నలిస్ట్ సంగు వసంత్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కాసుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాసులు, కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి తగరం రాజు, వీర మహిళలు ఐనా బత్తిన రాధిక, పోలిశెట్టి మాధురి, ఉప్పుటూరి రజినీ, రమణమ్మ రత్నకుమారి, షకీలా, బీజేపీ నాయకులు, తిరుమల, శివ కుమారి, సుల్తాన్ బి, ప్రియరాధిక, మరియు జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *