రేణిగుంటలో హర్ ఘర్ తిరంగా – ఘర్ ఘర్ తిరంగా విజయవంతం

మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మరియు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ సూచనలుతో పలు చోట్ల మువ్వవెన్నెల జెండాలను రేణిగుంటలో ఎగురావేయడం జరిగినది. “హర్ ఘర్ త్రివర్ణ పతాకం” ప్రతి భారతీయుడు మన దేశ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతాకాన్ని తమ తమ ఇళ్లలోకి తీసుకువచ్చి గర్వంగా తమ ఇంటిపైన ఎగురవేయమని ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను సగర్వంగా ఆహ్వానించారు. అందులో భాగంగానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలం నందు అనేక ప్రాంతాల్లో మండల నాయకులుతో కలసి భారత జాతీయ జెండాను ఘనంగా ఎగురావేయడం జరిగినది. ఈ సందర్బంగా మండల ఇంచార్జ్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ భారత జాతీయ పతాకం కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదని, అది మన సమిష్టి గర్వానికి, భారతదేశ ఐక్యతకు ఒక ప్రగాఢమైన ప్రతీకని, కావున నరేంద్ర మోదీ గారి ఆకాంక్షతో మువ్వన్నెల జండాను ప్రతి పౌరుడు తమ ఇళ్లపైన ఎగురావేసి ఐక్యతను చాటుకోవాలని మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, బీడీ బాలాజీ పిలిపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి బీడీ బాలాజీ, జిల్లా కార్యవర్గ సభ్యులు కండ్రిగ యతీంద్ర రెడ్డి, జిల్లా యువమోర్చ ఉపాధ్యక్షులు ఎస్ ఆర్ వేణు గోపాల్, జిల్లా మాజీ కోశాధికారి శ్యామ్ చంద్ గేహ్లాట్, పట్టణ అధ్యక్షులు భీమవరం నరేష్, మండల ఉపాధ్యక్షులు చింత రాజా రాయల్, ప్రధానకార్యదర్శి సొంగా పురుషోత్తం, కార్యదర్శిలు అశోక్, వెంకటరమణ రెడ్డి, మునివేలు, చంద్రయ్య, కర్వేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *