మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యానికి పెద్ద పీట వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కి సహకరించాలని జిల్లా పంచాయతీ అధికారి ముప్పూరి వేంకటేశ్వర రావు పిలుపు ఇచ్చారు. మంగళ వారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంట పాడు గ్రామ పంచాయతీ పరిధిలో అమలు జరుగుచున్న పారిశుధ్య కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ యంత్రాంగం చేపడుతున్న స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమం గురించి తడి చెత్త పొడి చెత్త సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఇంటిలో ఉండే తడి చెత్త పొడి చెత్త లను వేరు వేరుగా ఉంచి గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది కి చేరవెయ్యాలని ఆయన సూచించారు.గ్రామం అందంగా ఆరోగ్య వంతంగా ఉంటే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆయన హితవు చెప్పారు. పారిశుధ్య కార్యక్రమం అమలు గురించి తెలుసుకున్న అనంతరం చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త నుండి సంపద సృష్టి కేంద్రం లో రోజు వారి సేకరించే తడి,పొడి చెత్త గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రం ద్వారా సేకరించే చెత్త ద్వారా తయారయ్యే ఎరువును రైతులకు విక్రయించి ఆసంపద ను గ్రామ పంచాయతీ ఖాతా లో జమ చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చెయ్యాలని చేపట్టిన పథకం అమలు లో విజయం సాధించేవిధంగా పని చెయ్యాలని గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు, చెత్త నుండి సంపద సృష్టి కేంద్రం నిర్వాహకులు పర్యవేక్షకులకు సూచించారు.గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే స్వమిత్వ కార్యక్రమం లో భాగంగా ఇంటి కొలతలను పరిశీలించి ఇంటి యజమానులు, ఖాళీ స్థలాల యజమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొలతలు తీయాలని సిబ్బందిని డి పి ఒ ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన వెంట ఉప మండల అభివృద్ధి అధికారి ఆర్ రమేష్ బాబు, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయం పర్యవేక్షణ లో ఇంటి పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చెయ్యాలని ఆదేశించారు.ఈ సందర్భంగా డి పి ఒ తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
