జడ్పిపిఎఫ్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నివారించాలి ఎస్ టి యు డిమాండ్

మన ధ్యాస చిత్తూరు ఆగస్ట్-29 జడ్పిపిఎఫ్ రుణాలు తుది మొత్తాల చెల్లింపులలో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని నివారించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ టి యు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్ రెడ్డి, మోహన్ యాదవ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం, శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణని కలిసి ఒక వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తమ జీతాల నుంచి నెల నెల పొదుపు చేసుకున్న మొత్తాల నుండి అవసరానికి రుణాలు పొందాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పదవీ విరమణ చెందినవారికి గౌరవప్రదంగా తుది మొత్తాలు చెల్లించాల్సి ఉండగా, నెలల తరబడి వారు తిరగాల్సి రావడం ఆవేదన కలిగిస్తోందన్నారు. మిస్సింగ్ క్రెడిట్స్  కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జీతాల డ్రాయింగ్ అధికారులను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని కోరారు. ఏ ఒక్క ఉద్యోగి తమ మిస్సింగ్ క్రెడిట్ జమ చేయడం కోసం పిఎఫ్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరారు. పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో జమ కాకుండా, సస్పెన్స్ అకౌంట్లో ఉన్న కోట్లాది రూపాయల మొత్తాలకు జమవుతున్న వడ్డీ ఏమవుతుందో పరిశీలించాలని కోరారు. వీలైనంత త్వరగా జిల్లాలోని డ్రాయింగ్ అధికారులు అందరితో, పిఎఫ్ సమస్యలకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ మాట్లాడుతూ, తుది మొత్తాల చెల్లింపులకు సంబంధించి ఆడిట్ విభాగంలో ఎదురవుతున్న అభ్యంతరాలను పరిశీలించామని తెలిపారు. వీలైనంత వేగంగా రుణాలు తుది మొత్తాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీఎఫ్ మిస్సింగ్ క్రెడిట్స్ సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు
కార్యక్రమంలో నాయకులు దేవరాజులు రెడ్డి, చంద్రన్,శేఖర్, వాసు, బాలచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గుణశేఖర్, ఢిల్లీ బాబు,భరత్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..