

ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ఉదయగిరి మండల కేంద్రమైన అప్పసముద్రం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.హెచ్.పి సురేష్ మాట్లాడుతూ,తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని వారు తెలిపారు. బిడ్డకు ఆరు నెలలు వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు తాగించకూడదని తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోనే తల్లి పసుపు రంగు చీకటి పాలు అమృతం లాంటివని, వీటి ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని తెలిపారు. తల్లి పాలలో ఉన్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలలో ఉండవని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా తల్లిపాలు శిశువుకు న్యూమోనియా, అదే సార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో, హెల్త్ అసిస్టెంట్ ఎండీ మన్సూర్ అలీ,ఏఎన్ఎం సౌజన్య, ఆశ వర్కర్ విస్తారమ్మ, అంగన్వాడి టీచర్ దుర్గాభవాని, సుభాషిని, రజిత, తదితరులు పాల్గొన్నారు.