

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 7:
బంజారా భవన్ మరియు మందిరం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ ఎఐబిఎస్ మండల అధ్యక్షుడు గోపిసింగ్, జిల్లా ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ లోక్యా నాయక్‌తో పాటు తాండ వాసులు గురువారం మహమ్మద్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సవాయ్ సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ ఆచార వ్యవస్థ, సంప్రదాయాల పరిరక్షణకు బంజారా భవన్ నిర్మాణం అవసరమని తెలిపారు. ఇందుకోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.