

మన న్యూస్ ఐరాల జులై-31:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వైయస్.గేటు సమీపంలో గల మోటకంపల్లె గ్రామస్తులతో నూతనంగా నిర్మించిన గురప్ప స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. మోటకంపల్లె గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్ కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని గురప్ప స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, మోటకంపల్లె గ్రామస్తులు పాల్గోన్నారు.