

మన న్యూస్ తవణంపల్లె జులై-31:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండల పరిధిలోని దిగువమాఘం గ్రామంలో అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” కార్యక్రమాన్ని 31 గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో అంతర్జాతీయ దృక్పథం పెంపొందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారు ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాఎస్. భరణి, ఐ ఎఫ్ ఎస్, ఐఎఫ్ ఎస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మీనా జ్ఞానదేశికన్, ఎకనామిక్స్ అధ్యాపకురాలు – అగాఖాన్ అకాడమీ, హైదరాబాద్ రాళ్లపల్లి సతీష్, అమర రాజా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల నుండి వచ్చిన 20 సి బి ఎస్ ఈ పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఈ సమావేశంలో విద్యార్థులు ఐక్యరాజ్య సమితి నిర్మాణం, దాని పని విధానం, అంతర్జాతీయ సమస్యలపై చర్చలు, తీర్మానాలు చేయడం వంటి అనుభవాలను పొందారు. ఈ సందర్భంగా ఎస్. భరణి, ఐ ఎఫ్ ఎస్ మాట్లాడుతూ, ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం, మరియు సమకాలీన అంతర్జాతీయ సమస్యలపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మీరు ఎంచుకున్న అంశాలు — పర్యావరణ పరిరక్షణ, స్మార్ట్ ఎనర్జీ పాలసీలు, జలవనరుల పరిరక్షణ మొదలైనవి — సమకాలీన ప్రపంచానికి అత్యంత ప్రాధాన్యం కలిగినవి.మీలో ఎంతో ప్రతిభ, క్రమశిక్షణ కనిపించింది. గ్రామీణ ప్రాంతంలో ఉండి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఎం యు ఎన్ తరహా అనుభవాన్ని పొందడం చాలా గొప్ప విషయం. పై అందరికీ అభినందన తెలియజేశారుఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, బహుళ కోణాల దృక్పథాన్ని పెంపొందించడంలో ఎంతో సహాయపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని, ఇలాంటి అంతర్జాతీయ స్థాయి విద్యా కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు విశ్వవేదికపై పరిజ్ఞానం కల్పించాలనే లక్ష్యంతో అమర రాజా విద్యాలయం ప్రయత్నించుతోందని పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. జయశ్రీ తెలియజేశారు.