

గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 12వ రోజు లో భాగంగా బురదగాలికొత్తపాలెం పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వం పాలనపై పై ప్రజల చెపుతున్న అభిప్రాయాలను తెలుసుకుంటున్న… గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్
మాట్లాడుతూ. కుమ్మర పాలెం గ్రామం హరిజన వాడ నందు ప్రజల త్రాగు నీటి కోసం 21.70 లక్షల రూపాయలతో నిర్మించిన OHSR ట్యాంక్ ను ప్రారంభించారు. ఈ పంచాయతీ నందు ఇటీవల యర్రబోతు రామూర్తి కి 4.50 లక్షల CMRF – LOC అందించాము. 25 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సచివాలయం ను ప్రారంభించారు. పంచాయతీ లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలకు వివరించారు.
అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
