

మన న్యూస్: చిత్తూరు టిడిపి సభ్యత్వ నమోదులో నగరి నియోజకవర్గం వెనుకబడి ఉందని, సభ్యత నమోదు జరగనికుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని టిడిపి నాయకులు రామానుజం చలపతి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016లో తాను ఒకటవ డివిజన్లో వెయ్యి మందితో సభ్యత నమోదు చేయించానని తెలిపారు. మళ్లీ ఈ సంవత్సరం లక్ష రూపాయల ఖర్చుతో వెయ్యి మందికి సభ్యత్వ నమోదు చేయించేలా పనిచేస్తుంటే కొందరు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో టిడిపికి 40 వేల మెజార్టీ వచ్చిందని, అయితే సభ్యత నమోదు 20 వేలు కూడా నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఒకటవ డివిజన్లో సభ్యత్వ నమోదు ఉచితమని ప్రచారం చేసి.. ఇప్పుడు స్మగ్లర్లను, గుండాలను పంపించి బలవంతంగా సభ్యత్వ నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. నగిరి టిడిపిలో జరుగుతున్న విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గమనించాలని విన్నవించారు. ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని నగరిలో సభ్యత నమోదుపై సమగ్ర విచారణ జరిపించాలని విన్నవించారు. లేకుంటే నగరిలో పార్టీ కి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితిలో ఉన్నాయని వాపోయారు. సమావేశంలో ఒకటవ డివిజన్ మహిళా నేతలు లత, కన్నెమ్మ, అలిమేలు, రాధ, హేమ పాల్గొన్నారు.