

మన న్యూస్ :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం తిరుపతిలోనే ఒక ప్రైవేటు హోటల్లో మంత్రిని పులిగోరు మురళీకృష్ణ రెడ్డి కలిసి తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత పటిష్టం చేయడంతో పాటు పార్టీ అధికారంలోకి రావడానికి కృషిచేసిన తమలాంటి నాయకులకు పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని మంత్రికి పులిగోరు మురళీకృష్ణ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షులు నరసింహ యాదవ్ మీడియా కోఆర్డినేటర్ వర్మ తెలుగు యువత నాయకుడు గంజి సుధాకర్ రెడ్డి ఖాయం వెంకటరత్నం విజయ్ పాల్గొన్నారు.