రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

మన న్యూస్ సింగరాయకొండ:-
– సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి మరియు సింగరాయకొండ రైతు సేవా కేంద్రాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ. నిర్మల కుమారి మాట్లాడుతూ, రైతు సోదరులు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి శ్రీ టి. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, రసాయనిక ఎరువుల బదులు సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల నేల ఆరోగ్యం మెరుగవుతుందని, సాగు ఖర్చు తగ్గి లాభం పెరుగుతుందని తెలిపారు. వరి పంటలో సస్యరక్షణ చర్యలు, ఎరువుల వినియోగం, వ్యవస్థాపిత యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు.అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మినుము మరియు నువ్వు పంటలకు ఈనెల 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్, గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రియాంక, సాజిద్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Related Posts

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరిమన న్యూస్ : కలిగిరి ప్రాథమిక వైద్యశాల డాక్టర్లపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని కలిగిరి మండల అధ్యక్షురాలు ముట్టుకూరు శిరీష రెడ్డి ఎంపీడీవో ప్రత్యూషను కోరారు. కలిగిరి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు కలిగిరి ఎంపీడీవో…

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

కలిగిరిమనన్యూస్ : బుధవారం జరిగిన కలిగిరి మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి 23 మంది సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలు, ఒక కోఆపషన్ సభ్యులు, జెడ్పిటిసి సభ్యులు, అధిక సంఖ్యలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్