

మన న్యూస్ అనంతపురం జిల్లా :- ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం డొనేకల్లు గ్రామంలో 5న నిర్వహించబోయే ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.