రేపే బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభం- ఎమ్మెల్యే అమిలినేని

బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభానికి రైతులు తరలిరండి..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం మన న్యూస్ జూలై 4 :- కళ్యాణదుర్గం ప్రాంత రైతులు, ప్రజల జీవనాడి బీటీపీ కాలువ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు గారు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలసి బ్రహ్మాసముద్రం మండలం పొబ్బర్లపల్లి గ్రామ సమీపంలో సాయంత్రం 4.00 గంటలకు పునఃప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు తెలిపారు..
భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, విడతల వారిగా నగదు రైతుల ఖాతలకు జమ అవుతాయన్నారు.. రైతులు కాలువ తవ్వడానికి సంతోషంగా ఒప్పుకుంటున్నారని, కళ్యాణదుర్గం ప్రాంతంలో 90 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, ఇక్కడ ఇంత మంది ఆధారపడి ఉన్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే ఆర్ధిక శాఖ మంత్రి గారికి చెప్పి పనులు ప్రారంభించాలని చెప్పారన్నారు.. గత పాలకులు ఐదేళ్లు ఒక్క పైసా కూడా రైతులకు పరిహారం ఇవ్వకుండా, పనులు చేయకుండా నిర్వీర్యం చేశారని, ఇప్పుడు తిరిగి బీటీపీ పథకాన్ని గాడిలో పెడుతున్నామని వచ్చే 16 నుంచి 20 నెలల్లో కాలువ పూర్తి చేసి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లు తీసుకువస్థామన్నారు. జగన్ మీద వచ్చిన వ్యతిరేకతతో ప్రజలు, మహిళలు స్వచ్చందంగా బయటకు వచ్చి పెద్ద విజయాన్ని అందించారు.. నేడు సుపరి పాలనలో తొలి ఏడాది పురష్కరించుకొని గ్రామాల్లోకి వెళ్తుంటే నేడు కూడా సంతోషంతో మహిళలు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు..
పీ4 విధానం ద్వారా నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలను అధికారులు గుర్తించారని అందులో 1500 నుంచి 2000 కుటుంబాలను పూర్తి స్థాయిలో నిరుపేదలుగా గుర్తించామని వారిని పీ4 విధానంలో దాతలను తీసుకువచ్చి వారిని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దెందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాలో మన నియోజకవర్గమే పీ4 విధానంలో ఎక్కువ మందికి మంచి స్థాయిని కల్పించినందుకు మన అధికారలకు పేరు వస్తుందన్నారు.. ఎక్కడా కూడా అవినీతికి తావులేకుండా అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని, ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో అభివృద్ధిపై ద్రుష్టి పెట్టి అందరికి సంక్షేమ, అభివృద్ధి అందేలా చూస్తామన్నారు.. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు..

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///