మన న్యూస్ సింగరాయకొండ:-

పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని మల్లికార్జున్ నగర్ ప్రాథమిక పాఠశాల నుండి గౌదగట్ల వారిపాలెం పాఠశాలకు బదిలీ అయిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అర్రిబోయిన రాంబాబు గారికి స్థానిక కాలనీవాసులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు హృదయపూర్వకంగా వీడ్కోలు తెలిపారు.ఈ సందర్భంగా రాంబాబు గారు మాట్లాడుతూ—తాను 2017లో ఈ పాఠశాలలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విద్యపై అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో చర్చలు జరిపినట్టు చెప్పారు. పర్యావరణం పట్ల శ్రద్ధ పెంచే ఉద్దేశ్యంతో మొక్కల పంపిణీ నిర్వహించానని, విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు దాతల సహకారంతో నోటు పుస్తకాలు, అవసరమైన సదుపాయాలు అందించామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి విద్యా కమిటీతో కలిసి కృషి చేసిన విషయాన్ని గర్వంగా గుర్తు చేశారు.జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఆనందాన్ని ఆయన వ్యక్తపరిచారు. తనకు నిర్వహించిన వీడ్కోలు సభపై అభినందనలతో పాటు బాధ్యత మరింత పెరిగిందన్న భావన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని జె. సునీత, అంబటి బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, రమణి, మీరావలి, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *