దళిత, బహుజన సమస్యలపై కేంద్రమంత్రి డా. రాందాస్ అతవాలేతో మహేష్ స్వేరో భేటీ

ఐరాల ఆగస్టు 15 మన ద్యాస

కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డా. రాందాస్ అతవాలేను చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం. మహేష్ స్వేరో శనివారం ముంబైలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాంద్రాలోని మంత్రి స్వగృహం ‘సంవిధాన్’లో జరిగిన ఈ భేటీలో దళిత, బహుజన వర్గాల సమస్యలు, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.కేంద్ర మంత్రిగా డా. రాందాస్ అతవాలే పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ స్వేరో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదలు, దళితులు, బహుజనులు, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం దశాబ్దాలుగా డా. అతవాలే చేస్తున్న కృషి అభినందనీయమని మహేష్ స్వేరో పేర్కొన్నారు.బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దళిత, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం డా. రాందాస్ అతవాలే చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రామాల్లో స్మశాన వాటికల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కోరుతాంస్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ చిత్తూరు జిల్లాలోని అనేక దళిత, గిరిజన గ్రామాల్లో కనీస వసతుల్లో ఒకటైన స్మశాన వాటికలు లేకపోవడం ఆందోళనకరమని మహేష్ స్వేరో అన్నారు.చిత్తూరు జిల్లా, ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రామాల్లో పూర్తిస్థాయి స్మశాన వాటికల నిర్మాణానికి కేంద్ర ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే డా. రాందాస్ అతవాలేతో మరోసారి ప్రత్యేకంగా భేటీ అయి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మహేష్ స్వేరో వెల్లడించారు.దళిత, గిరిజన, బహుజన గ్రామాల మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రస్థాయిలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *