మన ధ్యాస ,నిజాంసాగర్, బిచ్కుంద, ఆగస్టు 16: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జొనిట–దాస్ వివాహ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. బిచ్కుందలోని డీబీఎల్ వద్ద నిర్వహించిన వివాహ విందుకు ముఖ్యమంత్రి విచ్చేయడంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి నూతన వధూవరులు జొనిట–దాస్లను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.