వెదురుకుప్పం, మన న్యూస్ వివరాలు:గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం, ఇనాం కొత్తూరు పంచాయతీ పరిధిలోని దామర కుప్పం గ్రామానికి చెందిన శ్రీమతి వనజాక్షి గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, ఇనాం కొత్తూరు పంచాయతీ సర్పంచ్ మోహన్ రెడ్డి, గ్రామ ప్రముఖులు చెంగలరాయలు, యోగేశ్వర్, మురళి రెడ్డి, లోకేష్ తదితరులు ఆమె భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు వనజాక్షి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వనజాక్షి గారి ఆకస్మిక మృతిపట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామస్తులు కూడా ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.ఈ సందర్భంలో తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్ మాట్లాడుతూ, “వనజాక్షి గారు మంచి గృహిణిగా, కుటుంబ సభ్యులకు ఆదర్శంగా ఉండేవారు. ఆమె మృతితో గ్రామానికి తీరని లోటు ఏర్పడింది. దైవం ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.గ్రామస్థాయి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వనజాక్షి గారి అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *