మన ధ్యాస, నిజాంసాగర్ మొహమ్మద్‌నగర్: మండల స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి రైతు వేదికలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అనితారెడ్డి తెలిపారు.ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించేందుకు స్థలం చిన్నగా ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు వేదికలో ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు రైతు వేదికలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.మండలంలోని ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో ప్రజావాణిలో సమర్పించవచ్చని తెలిపారు. ప్రజావాణికి మండల స్థాయి అధికారులు హాజరవుతారని, ప్రజలు అందించే ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో అనితారెడ్డి వెల్లడించారు.కావున మండల ప్రజలు ప్రజావాణి నిర్వహించే స్థలం ఎంపీడీవో కార్యాలయం కాకుండా రైతు వేదిక అని గమనించి, సోమవారం ఉదయం 10 గంటలకు రైతు వేదికకు వచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో అనితారెడ్డి కోరారు.