మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండకు చెందిన స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్‌ విద్యార్థిని కోలపర్తి వెంకట సాయి ఆరాధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును నిలుపుకుంది. ఆమె 5వ తరగతి చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో ఆసక్తి చూపిస్తూ, 2023 డిసెంబర్ 24న హైదరాబాద్‌లో జరిగిన “The Largest Kuchipudi Dance Lesson” ఈవెంట్‌లో పాల్గొంది.ఈ ప్రపంచ రికార్డు కార్యక్రమాన్ని భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించగా, మొత్తం 4,218 మంది పాల్గొనగా వారిలో సాయి ఆరాధ్య కూడా ఒకరిగా గిన్నిస్ బుక్‌లో చోటుదక్కించుకుంది. ఈ ఘనతకు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు అధికారికంగా సర్టిఫికెట్ అందజేసింది.స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ డా. గీతా రాణి మాట్లాడుతూ, “ఇంత చిన్న వయసులోనే గిన్నిస్ రికార్డులో పేరును నమోదు చేయడం గర్వకారణం. ఇది నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకం,” అని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు, తల్లిదండ్రులు, మరియు స్థానిక సింగరాయకొండకు ప్రజలు ఆమెను అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *